cకాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లో 81 శాతం భూభాగాన్ని ఆక్రమించిన తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. తాజాగా లోగర్ ప్రావిన్స్, కందహర్, హెరత్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లుతెలిపింది. అమెరికా, నాటో సేనలు ఈ నెలాఖరుకు పూర్తిగా వైదొలగనున్న దశలో అఫ్ఘాన్ క్రమంగా మళ్లీ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. మిలిటరీ బలగాలూ సైతం తాలిబన్లకు లొంగిపోతున్నాయి. కాందహార్ సెంట్రల్‌జైలును ఆక్రమించారు. ఇక మిగిలింది దేశరాజధాని కాబూలే. మెరుపు దాడులకు అక్కడి ప్రభుత్వం రాయబారానికి దిగింది. మధ్యవర్తిగా ఉండాల్సిందిగా గల్ఫ్ దేశం ఖతార్‌ను కోరింది. దీని గురించి గురువారం తాలిబన్లు, అఫ్ఘాన్ రాయబార వర్గాలకు మధ్య చర్చలు జరిగినట్లు అల్-జజీరా వార్తా సంస్థ కథనాల్ని ప్రసారం చేసింది.