న్యూఢిల్లీ : జ్యుడిషియల్ కస్టడీ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడేండ్లలో భారత్‌లో దాదాపు 5221 మంది జ్యుడిషియల్, 348 మంది పోలీసు కస్టడీల లో మరణిం చారని రాజ్యసభ సభ్యుడు రామ్‌కుమార్ వర్మ అడిగిన ప్రశ్నకు కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రారు సమాధానమిచ్చారు. జ్యుడిషియల్ కస్టడీ మరణాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందున్నాయి. యూపీలో అత్యధికంగా 1295 మరణాలు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (441), పశ్చిమ బెంగాల్ (407), బీహార్ (375) లు ఉన్నాయి. పోలీస్ కస్టడీ మరణాలు గుజరాత్లో (42) అధికంగా నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (34), మహారాష్ట్ర (27), యూపీ (23) లు ఉన్నాయి. ఇక సంవత్స రాల వారీగా చూసుకుంటే 2020-21లో 1940 కస్టోడియల్ మరణాలు జరిగాయి. 2019-2020 లో 1696, 2018-19లో 1993 మరణాలు నమోదయ్యాయి. ఇండియా స్పెండ్ విశ్లేషణ ప్రకారం.. 2010-2019 మధ్య పోలీస్ కస్టడీలోని అధిక మరణాలు జబ్బుపడటం, సహజకార ణాలతో 40 శాతం, ఆత్మహత్యలుగా చెప్పబడినవి 29 శాతంగా ఉన్నాయి. ఇదే వ్యవధిలో 1004 మరణాలు పోలీస్ కస్టడీలో సంభవించాయి. 2010-13 మధ్య కేవలం నలుగురు పోలీసులు మాత్రమే దోషులుగా తేలడం గమనార్హం.