మహిళను మృగాడి నుంచి కాపాడిన శునకం

మహిళను మృగాడి నుంచి కాపాడిన శునకం

భోపాల్ : శునకం మరోసారి విశ్వాసానికి మారుపేరుగా నిలిచి వార్తలెక్కింది. కొద్దిగా తిండి పెట్టి చేరదీసినందుకు ఓ వీధికుక్క ఆ ఇంటి యజమానురాలిని ఓ మృగాడి నుంచి రక్షించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని చోళ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చోల ప్రాంతానికి చెందిన ఓ మహిళ మీద ఆమె ఇంటి పక్కనే నివసించే సునీల్‌ అత్యాచారయత్నం చేయబోయాడు. ఆ సమయంలో అతడు తాగిన మైకంలో ఉన్నాడు. ఆమె తీవ్రంగా వ్యతిరేకించడంతో అతడు తిట్టడం మొదలు పెట్టాడు. ఈ ఘటనను గమనించిన శేరు అనే శునకం ఆ మహిళను కాపాడటానికి అతడి మీద దాడి చేసింది. దాంతో ఆందోళనకు గురైన సునీల్.. దాన్నుంచి తప్పించుకోవడానికి కత్తితో పొడిచి, అక్కడి నుంచి పారిపోయాడు. కాస్త అన్నం పెట్టినందుకు ఆ శునకం అంతటి విశ్వాసాన్ని చూపించింది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..తాము ఉండే కాలనీలోనే సునీల్ కూడా ఉంటాడని, ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతుంటాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసినట్లు స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం అతడు తప్పించుకొని తిరుగుతున్నాడని, త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు. గాయపడిన శేరుకు చికిత్స అందిస్తున్నామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos