ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్ని గడించాయి. ప్రారంభం నుంచి చివరి వరకూ సూచీలు లాభాల్లోనే కొనసాగాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ తదితర హెవీ వెయిట్ కంపెనీలు లాభాల్ని పొందాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 52,950కి పెరిగింది. నిఫ్టీ 122 పాయింట్లు పుంజుకుని 15, 885కి ఎగ బాకింది. సెన్సెక్స్ లో టైటాన్ కంపెనీ (3.44%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.97%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.77%), యాక్సిస్ బ్యాంక్ (1.69%), మారుతి సుజుకి (1.38%).అధిక లాభాల్ని పొందాయి. టాటా స్టీల్ (-1.66%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.68%), బజాజ్ ఫైనాన్స్ (-0.48%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.23%), హెచ్డీ ఎఫ్సీ బ్యాంక్ (-0.21%) బాగా నష్ట పోయాయి.