విశాఖ : విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేయ రాదని డిమాండు చేస్తూ వైకాపా పార్లమెంటు సభ్యులు సోమవారం దేశా రాజధానిలో నినదించారు. విశాఖ ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో సోమవారం జరిగిన ధర్నాకు వారు మద్దతు పలికారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసే నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం పునరా లో చిం చుకోవాలని నినాదాలు చేశారు. విజయసాయిరెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ ఈ ధర్నాలో పాల్గొన్నారు. “సేవ్ వైజాగ్ స్టీల్”అని నినాదాలు రాసిన అట్టల్ని చేబూని నినదించారు.