కేశవగిరి: మంచినీళ్లనుకుని ప్లాస్టిక్ సీసాలో ఉన్న యాసిడ్ కలిపి మద్యం తాగిన ఓ ఆటోడ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్ జి.కోటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం… చాంద్రాయణగుట్ట కుమ్మరివాడిలో నివసించే గణ్‌పతిస్వామి రెండో కుమారుడు విజయ్‌కుమార్ స్వామి (26) ఆటో డ్రైవర్. ఈనెల 27న ఆదివారం మద్యం సీసాతో ఇంటికి వచ్చిన విజయ్‌కుమార్ మిద్దెపైకి వెళ్లాడు. బాత్‌రూం కిటికీ గోడపై ఉంచిన ప్లాస్టిక్ బాటిల్‌ను నీళ్ల సీసాగా భావించి మద్యంలో కలిపి తాగాడు. కొద్దిసేపటికి అది యాసిడ్ అని గుర్తించాడు. అప్పటికే గొంతులో మంటగా ఉండడంతో అరిచాడు. తండ్రి గణ్‌పతిస్వామి స్థానికుల సహకారంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. విజయ్ సోమవారం రాత్రి మృతిచెందాడు.