హైదరాబాద్: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండి పడ్డారు. హాలియాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.‘ కృష్ణా జలాలపై పొరుగు రాష్ట్రం దాదాగిరీ చేస్తోంది. ఆ రాష్ట్రం ప్రభుత్వం క్రమంగా ప్రాజెక్టులు ఎలా కడుతోందో అందరూ చూస్తున్నారు. ఇందువల్ల తెలంగాణకు ఇబ్బంది సంభవించ వచ్చు. అందువల్ల మనం జాగ్రత్త పడాలి. పెద్ద దేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్లను మళ్లిస్తాం. సంబంధిత పనుల కోసం సర్వే జరుగుతోందన్నా’రు. ఇంకా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని ఎగతాళి చేశారు. ‘24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామని మేము చెపితే గతంలో జానారెడ్డి ఎగతాళి చేశా. అదే జరిగితే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానన్నారు. మేము 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. కానీ జానారెడ్డి మాత్రం మొన్నటి ఉపఎన్నికలో కాంగ్రెస్ కండువానే కప్పుకుని పోటీ చేశార’ని చెప్పారు