న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం పై తాను తీర్పు చెప్పలేనని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వెల్లడించారు. మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తే ధర్మాసనం సహాయపడు తుందని చెప్పారు. మధ్యవర్తిత్వం కాకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలనుకుంటే మరో ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరఫున హాజరైన న్యాయవాదులకు సూచించారు. దరిమిలా ఉభయులూ తమ నిర్ణయాల్ని తెలపాలని కోరారు. తదుపరి విచారణను బుధ వారానికి వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, తెలంగాణ తరపున సిఎస్ వైద్యనాధన్ వాదించారు. తమ న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.