బెంగళూరు: గగన్యాన్లో భాగమైన మానవ రహిత అంతరిక్ష యాత్రను వచ్చే డిసెంబర్లో చేపట్టడం సాధ్యం కాదని ఇస్రో ఛైర్మన్ కే శివన్ అధికారికంగా ధ్రువీకరించారు. వచ్చే ఏడాది దాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. కరోనా సంక్షోభం దీనికి కారణమని వివరించారు. కరోనా పరిశ్రమల్ని తీవ్రంగా ప్రభావితం చేయటంతో ఈ పథకానికి అవసరమైన హార్డవేర్ సరఫరా నిలిచిపోయిందని ఇస్రో వర్గాలు తెలిపాయి. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం 2022 నాటికి అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగాములను సుమారు 5-7 రోజుల పాటు పంపాలనేది గగన్యాన్ లక్ష్యం. ఇందులో భాగంగా తొలి మానవ రహిత మిషన్ 2020 డిసెంబర్, రెండోది 2021 జూన్లో, చివరి దాన్ని 2021 డిసెంబర్లో చేపట్టేందుకు ప్రణాళిక రచించారు.