విజయవాడ: వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో విజయవాడలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్కు తరలిం చారు గ్యాస్, పెట్రోల్, డీజిల్పై పెంచిన ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని మధు స్పష్టం చేశారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఆందోళనలు జరుగుతాయని చెప్పారు. ప్రధాని మోదీ ప్రజలపై రూ. 36 లక్షల కోట్ల పన్నులు వేశారని విమర్శించారు.