త్వరలో త్రిష పెళ్లి

  • In Film
  • July 24, 2021
  • 167 Views

చెన్నై : నటి త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నదనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మూడు పదుల వయసులో త్రిష ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోనున్నట్లు సమాచారం. కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్‌తో ఆమె ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకోవాలని ఉభయులూ నిర్ణయించారని తెలుస్తోంది. పెద్దలు కూడా వారి పెళ్లికి అంగీకరించారట. తమిళంలో ఆమె నటించిన ఓ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారని, చిత్రీకరణ సమయంలో వారు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ప్రస్తుతం త్రిష  అయిదు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. గతంలో ఆమెకు వ్యాపారి వరుణ్‌తో నిశ్చితార్థమైనా, మనస్పర్థలు రావడంతో మధ్యలోనే తెగదెంపులు చేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos