బెంగళూరు : ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ధ ఎక్కువవుతున్న ప్రస్తుత తరుణంలో హవాయ్ గ్రూపు హవాయ్ బ్యాండ్ 6 అనే ఆరోగ్య పర్యవేక్షణ గడియారాలను విడుదల చేసింది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి, హృదయ స్పందన, నిద్ర తదితర ఆరోగ్య సంబంధిత అంశాల పర్యవేక్షణకు ఈ గడియారాలు ఉపకరిస్తాయి. స్మార్ట్ వాచ్ లాంటి ఇంటరాక్టివ్ అనుభవాన్నివీటి ద్వారా ఆస్వాదించవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హవాయ్ బ్యాండ్ 6ను ఒకసారి ఛార్జి చేస్తే 14 రోజుల పాటు బ్యాటరీ నిరంతరాయంగా పని చేస్తుందని పేర్కొంది. అమెజాన్ ప్రైమ్ డే అమ్మకాల్లో వీటిని పొందవచ్చని తెలిపింది.