‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్లు లేదు’

‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగినట్లు లేదు’

న్యూ ఢిల్లీ : రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు లేదని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. రాజధాని భూముల్లో అవకతవకలు, అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టి వేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలూ జరిగలేదంటూ తీర్పు ఇచ్చింది. దీన్ని ప్రభు త్వం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. దీనిపై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, ఆలోచనలు వినకుండా హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. మేము లేవ నెత్తిన ఏ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోనందున పిటిషన్పై విచారణ చేపట్టండి’ అని విన్నవించారు. హైకోర్టు అన్ని అంశాలనూ పరిగణించాకే తీర్పు ఇచ్చినట్లు గమనిం చామని ధర్మాసనం పేర్కొంది. అక్రమ మారు బేరాలు (ఇన్సైడర్ ట్రేడింగ్) జరిగినట్లు తమకు ఎక్కడా కనిపించడం లేదంటూ విచారణను 19కి వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos