అఫ్గానిస్తాన్‌లో భారత జర్నలిస్ట్ మృతి

అఫ్గానిస్తాన్‌లో భారత జర్నలిస్ట్ మృతి

కాందహార్: అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ చీఫ్ ఫొటోగ్రాఫర్,భారత్కు చెందిన సీనియర్ ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ మృతి చెందారు. పూర్తి వివరాలు ఇంకా తెలియ లేదు. అఫ్గాని స్తాన్ టీవీ చానల్- టోలో న్యూస్ ప్రకారం కాందహార్ ప్రావిన్స్, స్పిన్ బోల్డాక్ జిల్లాలో శుక్రవారం ఉదయం అఫ్గాన్ ప్రత్యేక బలగాలపై జరిగిన దాడిని కవర్ చేస్తున్నపుడు దానిష్ మృతి చెందారు. తాలిబన్లు బుధవారం స్పిన్ బోల్డక్ నగరం, అక్కడ పాకిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఒక కీలక పోస్టును తమ అధీ నంలోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా అఫ్గానిస్తాన్లో కొనసాగుతున్న ఘర్షణలు, ఉద్రిక్తతలను సిద్ధిఖి కవర్ చేస్తున్నారు. గతంలో ట్విటర్ ద్వారా అక్కడి పరిస్థితులను వివరించేవారు. అక్కడ దాడుల నుంచి తను తృటిలో ఎలా తప్పించుకున్నారో చెప్పేవారు. తమ ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ అఫ్గానిస్తాన్లో చనిపోవడం తీవ్ర వేదనకు గురిచేసిందని రాయిటర్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రీడెన్బరో, ఎడిటర్ ఇన్ చీఫ్ అలెస్సాండ్రా గలోనీ ఒక ప్రకటనలో తెలిపారు. దానిష్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos