పీలీభీత్ : ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రైతులంతా బిజెపి ఓటమి లక్ష్యంతో పని చేస్తారని కొత్త సాగు చట్టాల రద్దుకు ఉద్యమించిన రైతులకు నాయకత్వం వహిస్తున్న టికాయిత్ ఇక్కడ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో బికెయు పోటీ చేయబోదని ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీకి మద్దతు కూడా ఇవ్వదు అని స్పష్టం చేశారు. రైతులంతా బిజెపి అధికారంలోకి రాకూడదన్న లక్ష్యంతో పనిచేస్తారని అన్నారు. పశ్చిమబెంగాల్లోనూ బిజెపికి వ్యతిరేక వాతావరణం ఏర్పడేలా చేయడంలో బికెయు విజయవంతమైందని టికాయిత్ పేర్కొన్నారు.