మోదీకి ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యం

మోదీకి ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యం

అమరావతి : ప్రధాని మోదీ ప్రతి అంశాన్నీ ఓటు బ్యాంకు కోణంలోనే చూస్తున్నారని తెదేపా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఎన్ని కల సమయంలో చైనా, పాకిస్తాన్ యుద్ధం అంటూ మాట్లాడే మోడీ రెండు రాష్ట్రాల మధ్య వచ్చిన జల వివాదాన్ని ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాన్ని మోదీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తనకు అంత సమ యం లేకపోతే సాగునీటి మంత్రి ద్వారా అయినా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య ఇంత గొడవ జరుగుతున్నా పట్టించు కోక పోవ డం సరికాదన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos