12 మందిపై వేటు…22 మందికి చోటు.

12 మందిపై వేటు…22 మందికి చోటు.

భారీగా కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ

న్యూఢిల్లీ: కేబినెట్ విస్తరణ కోసం మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తే చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ విస్తరణ చేశారు. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్‌లో చోటు కల్పించినట్లు సమాచారం.  రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణె, అసోం మాజీ సీఎం సర్వానంద్ సోనోవాల్ కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేబినెట్ విస్తరణకు ముందు కొందరు మంత్రులు కేబినెట్ నుంచి తప్పుకోగా.. కొందరికి పదోన్నతి లభించింది. ప్రస్తుతం కేబినెట్‌లో సహాయమంత్రులుగా కొనసాగుతున్నకిరణ్ రిజుజు, కిషన్ రెడ్డి, హర్ దీప్ సింగ్ పూరి, అనురాగ్ ఠాగూర్ వంటి వారికి ప్రమోషన్ లభించింది.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, న్యాయ, ఐటీ శాఖల మంత్రి  రవి శంకర్ ప్రసాద్, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ప్రతాప్ సొరంగి, తన్లాల్ కటారియా రాజీనామా చేశారు. దీంతో మొత్తంగా ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. 22 మంది కొత్త వారికి ఈసారి మంత్రులుగా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos