‘ఆగస్టు నుంచే కరోనా మూడో దశ వ్యాప్తి’

న్యూ ఢిల్లీ: కరోనా ఆగస్టు నుంచే మూడో దశ దాడి ప్రారంభం కానుందని ఎెస్బీఐ హెచ్చరించింది. ‘కొవిడ్-19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరిట ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం. మే 7న భారత్.. రెండో దశ తీవ్ర స్థితికి చేరింది. ఈ గణాంకాలను బట్టి జులై రెండో వారంలో సుమారు రోజుకు పది వేల కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు రెండో అర్ధభాగంలో కేసులు పెరుగుతాయి. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం రెండో దాడితో పోలిస్తే మూడో దశలో కేసులు సగటున 1.7 రెట్లు అధికంగా ఉంటాయి. దేశంలో గత పోగడలను గమనిస్తే ఆగస్టు రెండో అర్ధభాగం నుంచే కేసులు పెరిగే అవకాశం ఉంది. నెల రోజుల తర్వాత కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరవచ్చు. భారత్ లో రోజుకు 40 కోట్లకు పైగా టీకా మోతాదుల్ని పంపిణీ చేస్తోంది. మొత్తంగా 4.6 శాతం జనాభాకు టీకా పూర్తైంది. 20.8 శాతం మంది ఒక మోతాదు తీసుకున్నారు. యూఎస్, యూకే, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలతో పోలిస్తే టీకా శాతం చాలా తక్కువగా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos