రామ జన్మభూమిన్యాస్‌కు ప్రభుత్వం చేయగలిగినది ఇదే : రామ్ మాధవ్

రామ జన్మభూమిన్యాస్‌కు ప్రభుత్వం చేయగలిగినది ఇదే : రామ్ మాధవ్

న్యూఢిల్లీ : అయోధ్య రామ జన్మభూమి వివాద రహిత స్థలాన్ని రామ జన్మభూమిన్యాస్‌కు తిరిగి ఇవ్వడానికి సుప్రీంకోర్టును కోరడం ప్రభుత్వం తీసుకోదగిన కనీస చర్య అని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ అఫిడవిట్ దాఖలు చేసిందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ భూమిని తిరిగి తమకు ఇవ్వాలని రామ జన్మభూమి న్యాస్ 23 ఏళ్ళుగా గట్టిగా కోరుతోందని గుర్తు చేశారు. తమ భూమి తమకు ఇవ్వాలని రామ జన్మభూమి న్యాస్ మొట్టమొదట 1996లో కోరిందని చెప్పారు. అప్పటి నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆ డిమాండ్‌ను పట్టించుకోలేదన్నారు. సుప్రీంకోర్టు అనుమతిని కోరేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వివాద స్థలంపై విచారణలో ఆలస్యమవుతున్నందువల్ల తాము తీసుకోదగిన కనీస చర్య ఇదేనని భావించామని తెలిపారు. 42 ఎకరాల భూమిని రామ జన్మభూమి న్యాస్‌కు తిరిగి ఇవ్వగలిగితే, అదొక గొప్ప శుభవార్త అవుతుందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos