వచ్చే మూడు రోజుల్లో నాలుగు లక్షల టీకాల పంపిణీ

వచ్చే మూడు రోజుల్లో నాలుగు లక్షల టీకాల పంపిణీ

న్యూఢిల్లీ : రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 4 లక్షలకు పైగా టీకా మోతాదుల్ని అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఇక్కడ వెల్లడించింది. మొత్తం 4,86,180 వ్యాక్సిన్లను అందిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 1,82,21,403 టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వృథా అయిన వాటితో కలిపి ఇప్పటి వరకు 20,80, 09, 397 టీకాలు వినియోగం అయ్యాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తంగా 20,89,02,445 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. సెంట్రల్ డ్రగ్స్ లాబోరేటరీ (సిడిఎల్) ప్రతి నెలా క్లియర్ చేసిన టీకాల్లో 50 శాతాన్ని కేంద్రం కొంటోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos