చెన్నై: నేరాలు అతి తక్కువగా నమోదయ్యే లక్షదీవుల్లో గూండా చట్టాన్ని ఎందుకు ప్రవేశపెట్టాలనుఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘లక్షదీవుల్లో జీవిస్తున్న మైనార్టీ వర్గాల ప్రజలను భయపెట్టేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం ఖండనార్హం. ఈ చర్యలను దేశప్రజలు, అన్ని రాజకీయపార్టీలు తీవ్రంగా ఖండించాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లక్షదీవుల ను తన బానిసగా భావిస్తోంది. ఆదీవుల్లో నివసిస్తున్న 70 వేల మంది ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఆ ప్రజల ఆహార విధానంలో జోక్యం కలుగుజేసుకోవడానికి కేంద్రానికి ఎలాంటి అధికారం లేదు. ఇందుకు సంబంధించి ఏ చట్టంలోను చెప్పలేద’ని శనివారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.