నెల్లూరు : కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ చేసిన ఆనందయ్యను శనివారం తెల్లవారు జామున పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఔషధంపై సోమవారం నివేదిక వచ్చేవరకు ఆయన్ను అక్కడ ఉంచనున్నట్టు సమాచారం. ఈ నెల 21 నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని అనుమతించడంలేదు. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతోంది. కృష్ణపట్నంలో విధించిన 144 సెక్షన్ కొనసాగుతోంది.