ముంబై : ఆక్సిజన్ కావాల్సిన వారికి దేశ వ్యాప్తంగా డీటీడీసీ కొరియర్ ద్వారా సిలిండర్లు సరఫరా చేస్తామని నటుడు సోనూ సూద్ తెలిపారు. ఆక్సిజన్ కోసం www.umeedysonusood.com కు సమాచారాన్ని తెలపాలి. వాటిని పరిశీలించి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా పంపిస్తామ ని వివరించారు. దేశంలో ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులు ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నా సిలిండర్ ను ఉచితంగా పంపేలా ఏర్పాట్లు పూర్తి చేశాయన్నారు.