శ్రీనగర్: కుల్గాం జిల్లాలోని ఫైసల్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థ తీవ్రవాది జకీర్ భట్ ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జకీర్ భట్ షోపియాన్ ప్రాంతీయుడు. గత 8 ఏళ్లుగా అక్కడే నివసిన్నాడు. అతని ఇంటి నుంచి బాంబులు, తుపాకులికన భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. శుక్రవారం సాయంత్రం షోపియాన్లోని గనపోరా గ్రామంలో ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది అయిత్మద్ అహ్మద్ దార్ మృతి చెందాడు. గతను మార్చి 26 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నాడు. అతని నుంచి ఏకే- 56 రైఫిల్, బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.