న్యూ ఢిల్లీ: క్లిష్టతరమైన ఏరో ఇంజిన్ విడిభాగాల తయారీకి ఉపయోగించే నియర్ ఐసోథర్మల్ ఫోర్జింగ్ సాంకేతికతను రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసింది. రెండు వేల మెట్రిక్ టన్నుల ఐసోథర్మల్ ఫోర్జ్ హై ప్రెజర్‌ను ఉపయోగించి టైటానియం మిశ్రమం నుంచి ఐదు దశల అధిక-పీడన కంప్రెసర్ డిస్కులను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఏరోఇంజిన్ సాంకేతికతలో ఇది ఒక కీలక ముందడుగని డీఆర్డీవో పేర్కొంది.