రసాయనిక ప్రయోగశాలవుతున్న దేహాలు

రసాయనిక ప్రయోగశాలవుతున్న దేహాలు

న్యూఢిల్లీ: కోవీషీల్డ్ రెండు మోతాదులు వేసుకున్న వారిలో కొందరు కోవ్యాక్సిన్ తీసుకుంటున్నందుకు వైద్యులు ఆందోళన వ్యక్తం చేసారు. ఇందుకు వేర్వేరు ఫోన్ నంబర్లు, ఐడీలను ఉపయోగిస్తున్నారు. రెండు రకాల టీకాలకు శరీరం ఎలా ప్రతిస్పందిస్తుందో తెలియడం లేదని వైద్య నిపుణులు చెప్పారు. రెండు టీకాల వల్ల కరోనా నుంచి అధిక రక్షణ లభిస్తుందని భావించలేమని కర్ణాటకకు చెందిన కోవిడ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, సీనియర్ వైరాలజిస్ట్ డాక్టర్ వి రవి అన్నారు. ఇది వ్యవస్థలోని లోపాల్ని బహిర్గతం చేసిందని పిహెచ్ఎఎన్ఎ అధ్యక్షుడు డాక్టర్ ప్రసన్న వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలు తమ శరీరాలను రసాయనిక ప్రయోగ శాలలుగా మార్చుకోకూడదని నిపుణులు సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos