హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీకి అవకాశమివ్వలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ‘శనివారం ఉదయం ఇక్కడ కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్కు వెళ్లాను. కేసీఆర్ను కలుద్దామంటే ఆయన సమయాన్ని కేటాయించ లేదు. తెలంగాణలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కోరదలచాను. తెలంగాణ ప్రజల సమస్యలపై కేసీఆర్కు మేము ఎన్ని లేఖలు రాసినప్పటికీ స్పందన రావట్లేదు. అయినా నేను సమస్యలపై పోరాడుతూనే ఉంటాన’ని విలేఖరులకు చెప్పారు. ఏటీ అధికారిక నివాసం ప్రగతి భవన్కు ఈ రోజు ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వచ్చారు. అయితే, కేసీఆర్ను కలుద్దామంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల సమస్యలపై కేసీఆర్కు తాము ఎన్ని లేఖలు రాసినప్పటికీ స్పందన రావట్లేదని హనుమంతరావు మండిపడ్డారు. అయినప్పటికీ తాను సమస్యలపై పోరాడుతూనే ఉంటానని చెప్పారు.