జైపూర్: భారీగా కల్తీ నూనెను ఉత్పత్తి చేస్తున్నరావటంతో జిల్లా పరిపాలన యంత్రాంగం అల్వార్ లోని సింఘానియా నూనె కర్మాగారాన్ని శనివారం మూసి వేసింది. బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఆవ నూనె సీసాలను అక్కడ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కోసం వాటి నమూనాలను సేకరించారు. పతంజలి కల్తీ ఆవ నూనెను విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందడం వల్ల సోదాలు చేసినట్లు అల్వర్ సబ్ డివిజన్ అధికారి యోగేష్ ఠాగూర్ తెలిపారు.