న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు ఆసరాగా నిలవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. కొవిడ్ వల్ల అనాథలైన పిల్లలను గుర్తించివారిని ఆదుకోవాలని జిల్లా పాలనాధికారులకు న్యాయమూర్తులు ఎల్ఎన్ రావు, అనిరుద్ధ బోస్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. శనివారం సాయంత్రంలోగా వారి వివరాలను ఎన్సీపీసీఆర్ వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపింది. అనాథలైన పిల్లలను గుర్తించి వారికి తక్షణం సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలనివ్వాలని అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ రే చేసిన వినతికి ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.