కడప : కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించాడని ఒక యువకుడిని ఎస్సై జీవన్ రెడ్డి చితకబాదాడు. నెల 25 న కర్ఫ్యూ ఆంక్షలున్నా పట్టణంలో ఒక యువకుడు బైక్ పై వెళుతున్నపుడు కడప రెండో పట్టణ ఠాణా ఎస్సై జీవన్‌రెడ్డి కనిపించారు. దీంతో భయపడిన యువకుడు వెంటనే వాహనాన్ని వెనక్కి తిప్పి కొద్ది దూరంలోనే అదుపుతప్పి కిందపడ్డాడు. ఎస్సై అక్కడికి వచ్చి యువకుడిని లాఠీతో చితకబాదాడు. ఆ యువకుడు ఎస్సై కాళ్లను పట్టుకొని బతిమాలినా వదలిపెట్ట లేదు. యువకుడి శరీరమంతా గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సంచలనమయాయ్యయి. దరిమిలా ఎస్పీ అన్బురాజన్, ఎస్సైని విఆర్‌కు బదిలీ చేశారు.