తిరువనంతపురం: కేంద్ర పాలిత ప్రాంతం లక్షదీవుల్లో కొత్త అలజడి రగులుతోంది. స్థానికులు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు -సేవల్ లక్ష ద్వీప్ పేరిట ఉద్యమాన్ని ఆరంభించారు. కొచ్చికి 150-200 మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో లక్షద్వీప్ ఉంది. 10 ద్వీపాల్లో ప్రజలు నివశిస్తారు. జనాభా సుమారు 64 వేలు. అక్కడి ముస్లింలను షెడ్యూల్ తెగలుగా పరిగణిస్తారు. లక్షద్వీప్ ప్రజలంతా మలయాళ మాండలికమైన జెసెరీ భాష మాట్లాడతారు. మినికోయ్ ప్రజలు మాత్రం మహాల్ అనే భాష ఉపయోగిస్తారు. విద్య, వైద్యం కోసం కేరళపై ఆధారపడ్డారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటరుగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సన్నిహితుడైన ప్రఫుల్ ఖోడా పటేల్ ఉన్నారు. ఆయన రాకతో సమస్యలు మొదలయ్యాయి. ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు ప్రజల్లో అసంతృప్తికి ఆజ్యం పోసింది.