జైపూర్: మరణించాడనుకున్న ఒక వ్యక్తి సజీవంగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజసమంద్ లో ఓంకార్లాల్ (40) ఈ నెల 11న ఇంట్లో చెప్పకుండా ఉదయ్పూర్ వెళ్లాడు. అక్కడ అనారోగ్యం పాలవడంతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు చేరాడు. అక్కడే చికిత్స పొందుతున్న మరో రోగి గోవర్ధన్ ప్రజాపత్ మరణించాడు. మూడు రోజులైనా గోవర్ధన్ శవాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గోవర్ధన్ పొటోలను వివిధ మాధ్యమాల్లో ప్రచురించారు. వీటిని చూసిన ఓంకార్ లాల్ కుటుంబ సభ్యులు శవాగారంలోని ఒక మృత దేహాన్ని ఓంకార్గా పొరబడ్డారు. ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియులు నిర్వహించారు. అనంతరం వారం రోజుల తర్వాత ఓంకార్లాల్ ఇంటికి రావటంతో కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. చనిపోయాడనుకున్న బిడ్డ ఇంటికి రావడంతో సంతోషంలో మునిగిపోయారు.