కరోనా చికిత్స ప్రయోగానికి అనుమతి కోరిన జైడస్

కరోనా చికిత్స ప్రయోగానికి అనుమతి కోరిన  జైడస్

న్యూఢిల్లీ : తేలికపాటి కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తున్న వారికి చికిత్స అందించేందుకు వీలుగా యాంటీ బాడీ కాక్టెయిల్ క్లినికల్ ప్రయోగాలకు అనుమతించాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) రెగ్యులేటరీని జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ కోరింది. కాక్టెయిల్కు జిఆర్ఎస్-3308 అని పేరు పెట్టారు. గతంలో జంతు వులపై పరీక్షలు చేసినపుడు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గినట్లు తేలిందని, సురక్షితమని పేర్కొంది. మోనోక్లోనల్ యాంటీబాడీ ఆధారిత కాక్టెయిల్ను అభివృద్ది చేసిన ఏకైక సంస్థ జైడస్. కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొవడానికి, సమర్థవంతమైన చికిత్స అవసరమని జైడస్ కాడిలా మేనేజింగ్ డైరెక్టర్ షార్విల్ పటేల్ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos