న్యూ ఢిల్లీ: సామాజిక మాధ్యమాలపై కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల వల్ల వాట్సప్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టీకరించారు. అసభ్య భావాజాలం, దుష్ప్రచారాలను కట్టడి చేయటమే కొత్త నిబంధల లక్ష్యమన్నారు. వినియోగదారుల ప్రశ్నించే, విమర్శించే హక్కును ప్రభుత్వం సమర్థిస్తుందన్నారు. దుష్ప్రచారం, అసభ్య భావజాలానికి బాధితులైన వారికి ఉపయోగపడతాయన్నారు. కొత్త నిబంధనల ప్రకారం సోషల్ మీడియా(social media) సంస్థలు భారత్‌కు చెందిన గ్రీవియన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, కంపైలన్స్ ఆఫీసర్‌ను నియమించాలని కేంద్రం ఆదేశించింది.