మాస్కు ధరించలేదని మేకులు దించారు

మాస్కు ధరించలేదని మేకులు దించారు

బరేలి : బరాదరీ ప్రాంతంలో మాస్కు ధరించని తన కుమారుడి చేతికి, కాలికి పోలీసులు మేకులు దించారని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ‘మే 24 రాత్రి 10 గంటల ప్రాంతంలో నేను, నా కుమారుడు ఇంటి ముందు కూర్చున్నాం. అంతలో ముగ్గురు స్థానిక పోలీసులు అక్కడకు వచ్చి మాస్కులు ఎందుకు ధరించలేదని నా కుమారుడితో దురుసుగా వ్యవహరించారు. వాగ్వాదం జరగడంతో నా కుమారుడిని తీసుకెళ్లిపోయారు. స్థానిక పోలీసు పోస్టు వద్దకు వెళ్లి అడిగితే నా కుమారుడిని అరెస్టు చేస్తామని బెదిరించారు. మరుసటి రోజు తెల్లవారు జామున తీవ్ర గాయాలతో.. చేతికి, కాలికి మేకులతో దయనీయ స్థితిలో కనిపించిన’ట్లు బుధవారం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల్ని సీనియర్ ఎస్పీ రోహిత్ సజ్వాన్ ఖండించారు. ‘సదరు వ్యక్తిపై పలు పోలీసుస్టేషన్లలో కేసులున్నాయి. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికే వారు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు. వారి ఆరోపణలన్నీ నిరాధా రమైనవ’ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos