స‌ర‌యూ తీరంలోనూ డ‌జ‌న్ల కొద్దీ మృత‌దేహాలు

స‌ర‌యూ తీరంలోనూ డ‌జ‌న్ల కొద్దీ మృత‌దేహాలు

పిథౌర్ గఢ్: ఉత్తరాఖండ్లోని పిథౌర్గఢ్ జిల్లాలో సరయూ నది ఒడ్డున లెక్కలేనన్ని శవాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేసారు. ఈ మృతదేహాలు కరోనా బాధితులకు చెందినవిగా భావిస్తున్నారు. తాగునీటి సరఫరా కోసం ఈ నది నీటినే వినియోగిస్తున్నారు. నది కలుషితం కావడంతో కరోనా వ్యాప్తి స్తుందని స్థానికులు భయపడుతున్నారు.ఇప్పటికే ఈ జిల్లాలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. దీని గురించి తహసీల్దార్ పంకజ్ చందోలా మాట్లాడారు. నరయూ నదిలో దొరికిన మృత దేహాలు పిథౌర్గడ్కు చెందినవి కావన్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. కరోనా రెండో దాడిలో ఉత్తరప్రదేశ్, బీహార్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో గంగ, ఇతర నదుల ఒడ్డున మృతదేహాలు కనిపించడం సర్వ సాధారణంగా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos