కొచ్చి: కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ నియంతలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించాలనే డిమాండ్ పెరుగుతోంది. ముస్లింలు అధికంగా ఉన్నలక్షదీప్లో ప్రఫుల్ పటేల్ జంతు పరిరక్షణ పేరిట బీఫ్ ఉత్పత్తులపై నిషేధం విధించారు. తీర రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణపై తీర ప్రాంతాల్లో మత్స్యకారుల నివాసాల్నికూల్చివేశారని విపక్షాల ఆరోపణ. మరోవైపు మద్యం వినియోగంపై ఉన్న ఆంక్షలను ఎత్తేశారని తప్పు బట్టారు.‘లక్షద్వీప్ నుంచి వస్తున్న వార్తలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. లక్షద్వీప్ ప్రజల జీవితాలు, జీవనోపాధి, సంసఅతిపై ఆంక్షలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. లక్షద్వీప్తో కేరళకు బలమైన సంబంధం ఉంది. దానిని అడ్డుకునే మోసపూరిత ప్రయత్నాలను ఖండిస్తున్నామ’ కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ ట్వీట్ చేసారు. ప్రఫుల్ పటేల్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కెసి.వేణుగోపాల్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. ప్రఫుల్ ఏకపక్ష, ప్రజావ్యతిరేక నిర్ణయాలు లక్షద్వీప్ ప్రజల జీవనాన్ని, వారి జీవనోపాధిని, సంసఅతికి నాశనం చేస్తుందని అందులో పేర్కొన్నారు. ప్రఫుల్ సామ్రాజ్యవాద కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారని లక్షదీప్ లోక్సభ సభ్యుడు ఎన్సిపి నేత, మహ్మద్ ఫైజర్ విమర్శించారు. ఇదిలా ఉండగా లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్కు కేరళ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు విధుల నిర్వహణ బదులు, వివిధ ప్రభుత్వ విభాగాల వద్ద పెండింగ్లో ఉన్న లీగల్ పనులకు హాజరు కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎఎపి)కి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అడ్మినిస్ట్రేటర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కక్షదారు పేర్కొన్నారు