రేపు రైతుల నిరసన దినం

రేపు రైతుల నిరసన దినం

న్యూ ఢిల్లీ : మోదీ ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు, విద్యుత్ చట్ట సవరణలకు వ్యతిరేకంగా ఈ నెల 26న నిరసన దినం (బ్లాక్ డే) నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) పిలుపునిచ్చింది. దీనికి దేశవ్యాప్తంగా 12 విపక్షాలు, రైతు, కార్మిక, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. నిరసన దినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. 2020 నవంబర్ 26న ప్రారంభమైన రైతు పోరాటం ఇప్పటికి ఆరు నెలలు దాటింది. అయినా కేంద్రం మొండిగా వ్యవహరించి చట్టాలను ఉపసంహరించుకోవడానికి నిరాకరిస్తోంది. బ్లాక్డేను స్థానికంగా ఎక్కడికక్కడ జయప్రదం చేయాలని, నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా కష్టకాలంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా కార్పొరేట్ సేవలో మునిగిపోయిన మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను బలవంతంగా రైతులపై, దేశంపై రుద్దుతోంది. నిరంకుశ పోకడలను అందరూ ఖండించాలని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి రైతు ఉద్యమాన్ని గౌరవించి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బ్లాక్డేకు సిపిఐ రాష్ట్ర సమితి మద్దతు తెలిపింది. పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు, ప్రజలు బ్లాక్డేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దళిత్ శోషణ్ ముక్తి మంచ్, ఎపి హమాలీ, ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఎపి గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘాల రాష్ట్ర కమిటీలు వేర్వేరు ప్రకటనల్లో ఆందోళనకు మద్దతు తెలిపాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos