న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా రెండు లక్షలకు దిగువగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా మృతుల సంఖ్య కూడా తగ్గింది. గడచిన 40 రోజులుగా దేశంలో ప్రతిరోజూ రెండు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో… కొత్తగా లక్షా 95 వేల 485 కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేల 496 మంది ప్రాణాలు కోల్పోయారు. గత ఏప్రిల్ 14 న దేశంలో తొలిసారిగా రెండు లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి.