ముంబై: స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9:18 గంటల ప్రాంతంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 200కుపైగా పాయింట్లు పెరిగి 50 వేల 850 ఎగువ, జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 15,270 వద్ద ఉన్నాయి. బ్రిటానియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, హిందాల్కో, టైటాన్ కంపెనీలు లాభాల్లో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోల్ ఇండియా నష్టాల్లో కొనసాగుతున్నాయి.