అతి తీవ్ర తుపానుగా ‘యాస్​’

న్యూ ఢిల్లీ: తౌక్టేను మరవక ముందే దేశంపై మరో తుపాను- యాస్’ మే 26 న దాడి చేయనుంది. అతి తీవ్ర తుపానుగా మారి ఒడిశా, బంగాల్ తీరాలను దాటనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ఉత్తర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. మే 23కి అల్పపీడనంగా మారి వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది. మే 24కు తుపానుగా, ఆ తర్వాత 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని వివరించింది. తౌక్టే తుపాను ఇప్పటికే పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసింది. గుజరాత్లో బీభత్సం సృష్టించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos