85 కోట్ల స్పుత్నిక్​ వ్యాక్సిన్ల ఉత్పత్తి

85 కోట్ల స్పుత్నిక్​ వ్యాక్సిన్ల ఉత్పత్తి

న్యూ ఢిల్లీ: దేశంలో 85 కోట్ల స్పుత్నిక్ వీ టీకాలను తయారు చేయనున్నట్లు రష్యాలో భారత రాయబారి డి.బి. వెంకటేశ్ వర్మ తెలిపారు. ఆగస్టు నుంచి ఉత్పత్తి మొదలు కానుంది. మొత్తం టీకాల్లో 65- 70 శాతం భారత్ లోనే ఉత్పత్తి అవుతాయన్నారు. ఈ రోజు సెయింట్ పీటర్స్ బర్గ్ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఇప్పటి దాకా రష్యా నుంచి లక్షన్నర మోతాదులు దేశానికి అందాయన్నారు. మే చివరి నాటికి 30 లక్షల మోతాదులు అందుతాయని వివరించారు.టీకాను భారత్ లోనే సీసాల్లో నింపి విక్రయిస్తారు. ఆ తర్వాత సామర్థ్యాన్ని 50 లక్షలకు పెంచుతారు. మూడు దశల్లో స్పుత్నిక్ ఉత్పత్తి జరుగుతుంది. మొదటి దశలో రష్యాలో తయారై అక్కడే సీసాల్లో నింపిన టీకాలు సరఫరా, భారీ పరిమాణంలో టీకాను తీసుకొచ్చి దేశంలోనే సీసాల్లో నింపి సరఫరా, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ల సరఫరా అని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos