ముంచుకొస్తున్న తుపాను..

ముంచుకొస్తున్న తుపాను..

తిరువనంతపురం: తౌక్టే తుపాను వల్ల కేరళ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేరళ, కర్ణాటక పశ్చిమ తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొల్లాం జిల్లాలో తుపాను ధాటికి చెట్లు నేలకొరిగాయి. వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళలో లోతట్టు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. గోవాకు 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. తౌక్టే తుపాను గుజరాత్ తీరం వైపు కదులుతూ బలపడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos