బీజింగ్: అంగారకుడి పై జీవం ఆనవాళ్ల పరిశోధనకు చైనా చేపట్టిన తియాన్వెన్-1 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. ఇందులోని ల్యాండర్, రోవర్ అరుణగ్రహం ఉపరితలంపై దిగాయి. ప్రస్తుతం ఇవి అంగారకుడి కక్ష్యలో తిరుగుతున్నాయి. తియాన్వెన్ నుంచి విడిపోయిన రోవర్, ల్యాండర్ నిన్న సాయంత్రం సరిగ్గా 7.11 గంటలకు గ్రహంపై ఉటోపియా ప్లానిషియా ప్రాంతంలో కాలుమోపాయి. వీటిపై కొన్ని వారాలపాటు పరీక్షలు నిర్వహించిన తర్వాత అవి అక్కడి జీవం ఆనవాళ్ల అన్వేషణ మొదలు పెడతాయి. ఇప్పటి వరకు అమెరికా మాత్రమే అంగారకుడి ఉపరితలంపై వ్యోమనౌకలను క్షేమంగా దించింది. ఇప్పుడు చైనా ల్యాండర్, రోవర్‌ను క్షేమంగా దించిన చైనా ఆ ఘనత సాధించిన రెండో దేశంగా రికార్డుకెక్కింది.