ఉచిత టీకా మోతాదులు నెలాఖరుకు

ఉచిత  టీకా మోతాదులు నెలాఖరుకు

న్యూ ఢిల్లీ : దాదాపు 1 కోటి 92 లక్షల కరోనా టీకా మోతాదుల్ని రాష్ట్ర,కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ నెల 16 నుంచి 31 వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కేంద్రం శుక్రవారం ఇక్కడ తెలిపింది. వీటిలో 1 కోటి 62 లక్షల 50 వేల కొవిషీల్డ్, 29.49 లక్షల కోవాగ్జిన్ టీకామోతాదులు. రాబోయే పక్షం రోజుల్లో రెండో డోమోతాదు టీకా కోసం వచ్చే వారి సంఖ్య ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు టీకాల కేటాయింపులను సమాఖ్య ప్రభుత్వం నిర్ణయించింది. టీకాల వినియోగ విధానాన్ని కూడా పరిగణించారు. దేశంలో ఇప్పటికి సుమారు 18 కోట్ల మోతాదుల టీకాలు వేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos