న్యూ ఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలో బుధ వారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన మూడో దశ కింద అదనంగా ఆహార ధాన్యాలను మే, జూన్ నెలల్లో ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున అందిస్తారు. నగదు బదిలీ పథకంతో సహా మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపు 79.88 కోట్లు ఉంటుందని అంచనా. లాక్డౌన్ ,తుపాను, భారీ వర్షాలు, ఆహార సరఫరాలు, కోవిడ్ సంబంధిత ఆంక్షలు వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా తిండి గింజల్ని పంపిణీని ఎంత కాలం కొనసాగించాలో ఆహార, ప్రజా పంపిణీ శాఖ నిర్ణయిస్తుంది. సుమారు 80 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలను సుమారు 79.88 కోట్ల మందికి నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున రెండు నెలలపాటు పంపిణీ చేస్తారు. దీనికి సుమారు రూ.25,332.92 కోట్లు అవుతుందని అంచనా. ఒక టన్ను బియ్యానికి రూ.36,789.2; ఒక టన్ను గోధుమలకు రూ.25,731.4 ఖర్చవుతుంది.