ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 250 పాయింట్లకుపైగా పెరిగి 48,508 వద్ద, నిఫ్టీ దాదాపు 90 పాయింట్లు బలపడి 14,582 వద్ద ఉన్నాయి. దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. చమురు, లోహ, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ లాభాల్లో, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ తదితర 30 షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.