ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ఇందుకు కారణం. కి సెన్సెక్స్ 465 పాయింట్లు కోల్పోయి 48,253కి, నిఫ్టీ 137 పాయింట్లు పతనమై 14,496కి దిగజారాయి. సెన్సెక్స్ లో ఓఎన్జీసీ (1.86%), బజాజ్ ఫైనాన్స్ (1.12%), టీసీఎస్ (0.39%), నెస్లే ఇండియా (0.34%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (0.33%) బాగా లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.26%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.18%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.74%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్(-1.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.61%) నష్ట పోయాయి.