న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా బుధవారం ధర్నా చేపట్టనున్నట్లు భాజపా మంగళవారం ఇక్కడ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ విధాన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సంభవించిన హింస ను భాజపా ఖండించింది. తమ నేతలు, కార్యకర్తలు, కార్యాలయాలపై టీఎంసీ కార్యకర్తలు దాడులు చేశారని ఆరోపించింది. సంబంధిత వీడియోలూ బయటకు వచ్చాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ దేశ వ్యాప్తంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో ధర్నాకు దిగుతారని వివరించింది.