వారణాసి, అయోధ్యలో సమాజ్‌వాది పార్టీ ముందంజ

వారణాసి, అయోధ్యలో సమాజ్‌వాది పార్టీ ముందంజ

వారణాసి: ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సారథ్యంలో సమాజ్వాది పార్టీ (ఎస్పీ) సత్తా చాటుకుంది. వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లలో 15 సీట్లలో ఎస్పీ గెలుపొందింది. బీజేపీ కేవలం 8 సీట్లు సాధించింది. రాజకీయంగా వారణాసి, అయోధ్యలను నేతలు కీలకంగా భావిస్తుంటారు. పరగంగా, మత పర్యాటక పథకాల్ని ప్రభుత్వం ఈ రెండు చోట్ల అమలు చేస్తోంది. అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. తక్కిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ ప్రతినిధి ఒకరు ఆచితూచి వ్యాఖ్యానించారు. పార్టీకి ఊహించని ఫలితాలు రావడానికి కారణాలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని అన్నారు. పార్టీ శ్రేణులు ఆగ్ర హంతో ఉండటం, తిరుగుబాటు అభ్యర్థులు దీనికి కారణమని సీనియర్ కార్యకర్త ఒకరు అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు చాలా కాలంగా వినిపించిన సమస్యల్ని పట్టించు కోలే దన్నారు. తాజా ఫలితాలు నాయకత్వానికి ఒక హెచ్చరిక సంకేతమని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే వీటిని పార్టీ పరిష్కరి చుకోవాల్సి ఉందన్నారు. పార్టీ దయనీయ ఫలితాలకు వారణాసిలోని మంత్రులు కారణమని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలతో మంత్రులు మమేకం కావడం లేదని, నేతలు, కార్యకర్తల మధ్య అగాధం ఏర్పడిందన్నారు. యూపీ గ్రామ పంచాయతీ ఎన్నికల వోట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos